విద్యా సంస్థలకు సూచనలు జారీ చేయండి: సమగ్ర శిక్షా అభియాన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు నేషనల్ స్కాలర్‌షిప్ కోసం రాష్ట్రంలోని విద్యా సంస్థలు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా సూచనలు జారీ చేయాలని డీఈవోలకు సమగ్ర శిక్షా అభియాన్ అదనపు ఎస్‌పీడీ పీవీ శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు.
2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి రెన్యువల్‌తో కలుపుకొని మొత్తంగా 11,229 సంస్థలు దరఖాస్తు చేశాయని ఆయన తెలిపారు. 6,192 సంస్థలు రిజిస్ట్రేషన్ ఫారాలను సబ్మిట్ చేయాల్సి ఉందని, మరో 2,435 సంస్థలు ఫైనల్ సబ్మిషన్ చేయలేదని పేర్కొన్నారు.
Published date : 08 Feb 2020 04:15PM