వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుకు గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేపట్టింది.
ప్రస్తుతం గురుకుల పాఠశాలలన్నీ ఇంగ్లిష్ మీడియంలో ఉన్నందున... వీటి తరహాలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే కొనసాగుతున్నాయి. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్న ఈ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 326 ఉన్నాయి. ఇవన్నీ ఐటీడీఏ పరిధిలో ఉండగా... ఇందులో చదువుతున్న వారిలో మెజారిటీ విద్యార్థులు గిరిజనులే.
ప్రతిపాదనలు రెండేళ్ల క్రితమే...
ఆశ్రమ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలనే ఆలోచన రెండేళ్ల క్రితం నాటిదే. ఇందుకు సంబంధించి 2018లోనే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించింది. అనివార్య కారణాల వల్ల మీడియం మార్పు చేసే అంశం వాయిదా పడింది. తాజాగా మాధ్యమం మార్పు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల డీఎస్‌ఎస్ భవన్‌లో జరిగిన గిరిజన సలహా మండలి సమావేశంలో పలువురు సభ్యులు ప్రస్తావించారు. ఇంగ్లిష్ మీడియంకు ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో ఆశ్రమ పాఠశాలలను అదేతరహా అభివృద్ధి చేయాలని కోరారు. గురుకుల పాఠశాలలన్నీ ఇంగ్లిష్ మీడియంలో ఉన్నందున ఆశ్రమ పాఠశాలలు కూడా అలానే నిర్వహించాలని సూచించారు. ఈ అంశాన్ని గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం... ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో ఇదివరకే రూపొందించిన ప్రతిపాదనలను గిరిజన సంక్షేమ శాఖ రివైజ్ చేస్తోంది. వాటికి మెరుగులు దిద్ది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపొందిస్తోంది. వీటిని వచ్చేనెల రెండో వారంలోగా ప్రభుత్వానికి సమర్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీలైనంత త్వరితంగా ప్రభుత్వానికి సమర్పిస్తే 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఆమోదం లభించేలా చర్యలు వేగవంతం చేస్తున్నారు.

Published date : 23 Mar 2020 05:45PM