Skip to main content

ఉత్తరప్రదేశ్‌లో పరీక్షలు రాయకుండానే పైతరగతులకు...!

లక్నో: కరోనా(కొవిడ్-19) వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మార్చి 18 (గురువారం)నవెల్లడించింది. ఈ తరగతుల విద్యార్థులందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది. వాస్తవంగా యూపీలో ప్రైమరీ పాఠశాలలకు మార్చి 23 నుంచి 28 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేశారు. ఇక మిగతా తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అలాగే ఏప్రిల్ 2 వరకు విద్యాసంస్థలకు యూపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
Published date : 19 Mar 2020 03:09PM

Photo Stories