Skip to main content

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి: లేదంటే..

సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, అంతర్ జిల్లా బదిలీలను వెంటనే నిర్వహించాలని విద్యాశాఖను జాక్టో, యూఎస్‌పీసీ కోరింది.
ఈ మేరకు ఆ సంఘాల ప్రతినిధులు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ ను కలిసి శుక్రవారం నోటీసును అందజేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే దశలవారీగా ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో పాఠశాల స్థాయిలో నిరసనలు, 29న రాష్ట్ర స్థాయిలో మహా ధర్నా చేపడతామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తి కాగానే అధికారులతో చర్చించి సమస్య పరిష్కారిస్తామని చిత్రారామచంద్రన్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.
Published date : 28 Nov 2020 12:52PM

Photo Stories