త్వరలో వారానికి 3 రోజులు సెలవు..!
Sakshi Education
భారత ప్రభుత్వం త్వరలో కొత్త లేబర్ కోడ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగుల సెలవుల నిబంధనలలో మార్పు రావచ్చని అంటున్నారు. నూతన కార్మిక చట్టాల ప్రకారం రాబోయే రోజుల్లో వారంలో మూడు రోజులు సెలవు ఉంటుందని చెబుతున్నారు. మీరు ఇప్పుడు కార్యాలయానికి వెళితే వారానికి 6 లేదా 5 రోజులు పని చేయాలి. ఒకటి లేదా రెండు రోజులు సెలవు తీసుకోవాలి. కానీ కొత్త నిబంధనల ప్రకారం... ఒక రోజుకు బదులుగా ప్రతి వారం మూడు రోజులు సెలవు పొందుతారు. కేవలం 4 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి లేబర్ కోడ్ లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయాత్నాలు చేస్తోంది. కొత్త లేబర్ చట్టంపై మనీ కంట్రోల్ వెలువరించిన నివేదిక ప్రకారం ఉద్యోగులు పని గంటలు, రోజులలో ఉపశమనం పొందవచ్చు. వారంలో ఐదు రోజులకు బదులుగా 4 రోజులు ఉద్యోగం ఉంటుందని, రెండు రోజులకు బదులుగా వారంలో 3 రోజులు సెలవు ఉంటుందని చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ ఉద్యోగులు పరస్పర అంగీకారం ద్వారా ఈ ఒప్పందం చేసుకోవచ్చు.
Published date : 19 Jun 2021 02:13PM