టీసీఎస్‌లో ఉద్యోగాలకు పరీక్ష..వీళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
Sakshi Education
న్యూఢిల్లీ: యువతకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఎంత మక్కువో మనందరికి తెలిసిందే.
అయితే టాప్ కాలేజీలలో మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటారు. కొన్న కాలేజీలలో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉండవు. అలా ప్రతిభ గల విద్యార్థుల కోసం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగాలకు అర్హత కల్పించే నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్, (ఎన్‌క్యూటీ)ను 2018 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. తాజాగా 2020 సంవత్సరం ఎన్‌క్యూటీ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
కాగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు కంపెనీలు ఆశించే కాగ్నిటివ్ ఎబిలిటీస్‌ను ఎన్‌క్యూటీ ఎగ్జామ్‌లో పరీక్షించనున్నారు. అయితే అభర్థి ప్రతిభను గుర్తించే విధంగా తమ పరీక్ష ఉంటుందని, పరీక్షలో మెరుగైన స్కోర్ సాధిస్తే టాప్ కంపెనీలో ఉద్యోగం గ్యారెంటీ అని టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి తెలిపారు. మరోవైపు టాప్ కంపెనీలు అభ్యర్థుల నియామకాలకు తమ పరీక్ష స్కోర్ ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు వెంగుస్వామి పేర్కొన్నారు.
బీటెక్, బీఎస్సీ, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు లేక ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసి, ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారు ఎన్‌క్యూటీ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగ నియామకాల కోసం రెండు సంవత్సరాల వరకు ఎన్క్యూటీ పరీక్ష స్కోర్ కంపెనీలు అనుమతిస్తాయి.

Published date : 28 Sep 2020 12:03PM