Skip to main content

టీసీఎస్‌ ఉద్యోగులకు మరో బంపర్‌ ఆఫర్‌...త్వరలోనే ఫ్రెషర్లను కూడా..

ముంబై: ఉద్యోగుల జీతాల పెంపును అక్టోబర్‌ 1 నుంచి అమలు చేస్తున్నట్లు టీసీఎస్‌ తెలిపింది.
సెపె్టంబర్‌ ఆఖరుకి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,53,540గా ఉంది. ‘కష్టకాలంలో అసాధారణ స్థాయి లో పనిచేసిన టీసీఎస్‌ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. అక్టోబర్‌ 1 నుంచి జీతాల పెంపును అమలు చేయబోతున్నాం‘ అని సంస్థ గ్లోబల్‌ హెడ్‌ (మానవ వనరుల విభాగం) మిలింద్‌ లాకడ్‌ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం ప్రారంభించామని, సెపె్టంబర్‌ క్వార్టర్‌లో అంతర్జాతీయంగా రిక్రూట్‌మెంట్‌ పెంచామని వివరించారు. అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) ఆల్‌టైమ్‌ కనిష్టమైన 8.9%గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
Published date : 08 Oct 2020 01:05PM

Photo Stories