టీఎస్ బీసీ గురుకుల విద్యార్థులకు రూ. వెయ్యి నగదు: మంత్రి గంగుల కమలాకర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు చేతి గడియారాలు, జ్యామెట్రీ బాక్స్‌లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.
అలాగే ప్రతి విద్యార్థికి రూ.వెయ్యి నగదుతో పాటు పరీక్ష ప్యాడ్, స్టేషనరీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పదోతరగతి పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల సొసై టీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈనెల 8 నుంచి తిరిగి పరీక్షలు ప్రారంభం కానున్నందు న జాగ్రత్త చర్యలు పక్కాగా ఉండాలన్నారు.
Published date : 02 Jun 2020 04:12PM