టీఎస్ ఐసెట్ – 2021 దరఖాస్తు గడువు జూన్ 23 వరకు పొడిగింపు
Sakshi Education
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగించారు.
పరీక్షకు జూన్ 23వ తేదీ వరకు ఎలాంటి రుసుము లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుండడం, కొన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలు జరగకపోవడంవల్ల ఈ నెల 15వ తేదీతో ముగియనున్న గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలతో పెంచామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఐసెట్ – 2021 స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్ టిప్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ ఐసెట్ – 2021 స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్ టిప్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
Published date : 16 Jun 2021 06:01PM