Skip to main content

టీచర్ల బదిలీ షెడ్యూల్‌లో మార్పులు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను నవంబర్ 2 నాటికి నమోదయ్యే చైల్డ్ ఇన్ఫో డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
గతంలో 2020 ఫిబ్రవరి 29 నాటి డేటా ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టాలని పేర్కొనగా.. ఈసారి దాన్ని మార్పు చేశారు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పొడిగింపుతో దాని ఆధారంగా చేపట్టాల్సిన టీచర్ల బదిలీల ప్రక్రియలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ, టీచర్ల బదిలీలకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది.
Published date : 28 Oct 2020 03:13PM

Photo Stories