‘టెట్’ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్...ఈ అర్హతలు తప్పనిసరి
ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మార్చి17వ తేదీన జీవో 23ను విడుదల చేశారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో టెట్‌లో ఇంగ్లిష్ ప్రొఫెషియన్సీ ప్రశ్నలను ఈసారి తప్పనిసరి చేస్తున్నారు. 1–5 తరగతులకు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు పేపర్–1ఏను, 6–8 తరగతులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు పేపర్–2ఏను నిర్వహించనున్నారు. పేపర్–2ఏ రాసేవారు ఆసక్తి ఉంటే పేపర్–1ఏ కూడా రాయొచ్చు. కాగా, ప్రత్యేక స్కూళ్ల పోస్టులకు పేపర్–1బీ, పేపర్–2బీ నిర్వహిస్తారు. ఇకపై ఏడాదికి ఒకసారే టెట్ ఉంటుంది. కాగా, టెట్ నోటిఫికేషన్‌ను మేలో విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశముంది.
ఏపీ టెట్ మోడల్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
పేపర్–1ఏకు అర్హతలు ఇలా..
పేపర్–1ఏకు ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్రుగాడ్యుయేషన్‌లో ఓసీలు 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 45 శాతం) మార్కులు సాధించి ఉండాలి. రెండేళ్ల డీఎడ్ కోర్సు లేదా నాలుగేళ్ల బీఈడీ కోర్సు, రెండేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
▶ 2010 ఆగస్టు 23 కంటే ముందు డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ఉన్నవారిలో ఓసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
▶ పేపర్–1బీకి సంబంధించి విభాగాలను అనుసరించి వేర్వేరుగా 11 రకాల అర్హతలను నిర్దేశించారు.
ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి\
పేపర్–2ఏకు అర్హతలు ఇలా..
పేపర్–2ఏకు గ్రాడ్యుయేషన్ (సంబంధిత సబ్జెక్టు)లో ఓసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండడంతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. బీఈడీలో ఓసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. లాంగ్వేజ్ పోస్టులకు సంబంధిత లాంగ్వేజ్‌లో బీవోఎల్, పీజీతోపాటు పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు అర్హులు. స్పెషల్ స్కూళ్లకు సంబంధించి పేపర్–2బీలో ఆయా విభాగాలను అనుసరించి అర్హతలను నిర్దేశించారు.
ఏపీ టెట్ స్టడీమెటీరియల్ కోసం క్లిక్ చేయండి
అర్హత మార్కులు ఇలా..
టెట్ పరీక్షలు రాసే జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్టుగా పరిగణిస్తారు. టెట్ స్కోర్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. టెట్‌లో ఆయా అభ్యర్థుల స్కోరుకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. టెట్ నుంచి 20 శాతం, డీఎస్సీ నుంచి 80 శాతం వెయిటేజ్ కలిపి మెరిట్‌ను నిర్ణయిస్తారు.