తెలంగాణ ఉన్నత విద్యా మండలి రూ.10 కోట్ల విరాళం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్/నందిగామ: కరోనా వ్యాప్తి నిరోధానికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున రూ.10 కోట్లను సీఎంఆర్‌ఎఫ్ కు విరాళం అందించారు.
దీనికి సంబంధించిన చెక్కును చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, సెక్రటరి ఎన్. శ్రీనివాసరావు, మెంబర్ ఒ.ఎన్. రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెక్కును అందించారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో రూ.2.50 లక్షలు విరాళం అందించారు.
Published date : 29 Apr 2020 05:53PM