Skip to main content

సజావుగా ఏఎన్‌యూ పరీక్షలు

ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సోమవారం డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు సజావుగా సాగాయి.
అన్ని కేంద్రాల్లోనూ కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ పరీక్షలు నిర్వహించారు. వీసీ ఆచార్య పి.రాజశేఖర్ తదితరులు పర్యవేక్షించారు. డిగ్రీ పరీక్షలకు 96 శాతం మంది, పీజీ పరీక్షలకు 94 శాతం మంది హాజరయ్యారు. లాక్‌డౌన్ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ఏఎన్‌యూ పరిధిలో పరీక్షలు నిర్వహిస్తుండటం విశేషం. ఈ నెల 21 నుంచి జరగాల్సిన పీజీ సైన్‌‌స కోర్సుల నాలుగో సెమిస్టర్, ఎంసీఏ, సైన్‌‌స డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు ఈ నెల 14 నుంచే నిర్వహించనున్నారు. డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఈడీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28కి వాయిదా వేశామని సీఈ సీహెచ్ ఉషారాణి తెలిపారు.
Published date : 08 Sep 2020 07:06PM

Photo Stories