సీఎస్‌కు రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ లేఖ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలు పునఃప్రారంభించే తేదీలను ప్రకటించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కరోనా నేపథ్యంలో 3 వేలకుపైగా బడ్జెట్ ప్రైవేటు పాఠశాలలు ఆర్థిక సమస్యలతో మూతబడే పరిస్థితి ఎదుర్కొంటున్నాయని, ప్రైవేటు ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయారని, విద్యార్థులు సైతం తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు లేఖ రాసింది.
Published date : 19 Dec 2020 04:00PM