ఫిబ్రవరి 25న గురుకుల న్యాయ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని న్యాయ కళాశాలలో ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సొసైటీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని మహిళల న్యాయ కళాశాలలో ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. టీఎస్ లాసెట్–20లో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులని పేర్కొంది. ఎస్సీ కేటగిరీలో 50 సీట్లు, బీసీ–సీ కేటగిరీలో 4 సీట్లు, బీసీ, మైనార్టీ, ఓసీ కేటగిరీల్లో నాలుగు చొప్పున మొత్తం 66 సీట్లను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
Published date : 23 Feb 2021 05:06PM