ఫిబ్రవరి 21న టీఎస్ పీఈసెట్- 2020 నోటిఫికేషన్!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్-2020 నోటిఫికేషన్‌ను ఈనెల 21న జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పీఈసెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈనెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు స్వీకరించాలని నిర్ణయించింది. బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసే అభ్యర్థికి 2020 జూలై 1వ తేదీ నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. దాంతో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. డీపీఈడీ కోర్సు లకు ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న వారు, ఇంటర్ పూర్తయిన వారు ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 జూలై 1వ తేదీ నాటికి సదరు విద్యార్థికి 16 ఏళ్లు నిండి ఉండాలి. మే 13వ తేదీ నుంచి ని ర్వహించే ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు రూ.800 పరీ క్ష ఫీజును, ఎస్సీ, ఎస్టీలైతే రూ.400 పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షకు సంబం దించిన మరిన్ని వివరాలను https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
ఇదీ పీఈసెట్ షెడ్యూల్..
ఇదీ పీఈసెట్ షెడ్యూల్..
- 21-2-2020న: నోటిఫికేషన్; 21-2-2020 నుంచి: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సబ్మిషన్
- 13-4-2020: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సబ్మిషన్‌కు చివరి గడువు
- 20-4-2020 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
- 22-4-2020 వరకు: రూ. 500 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్
- 29-4-2020 వరకు: రూ. 2 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్
- 6-5-2020 వరకు: రూ. 5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్‌కు చివరి గడువు
- 8-5-2020 నుంచి: ఆలస్య రుసుముతో దరఖాస్తులు సబ్మిట్ చేసిన వారి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
- 13-5-2020 నుంచి: ఫిజికల్ టెస్టులు ప్రారంభం, అభ్యర్థుల సంఖ్యను బట్టి రోజులను నిర్ణయిస్తారు.
- టెస్టులు పూర్తయ్యాక వారంలో ఫలితాలను ప్రకటిస్తారు.
Published date : 20 Feb 2020 03:16PM