ఫిబ్రవరి 14న ఎన్‌టీఎస్‌ఈ- 2020 పరీక్ష
Sakshi Education
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ మీన్‌స కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షతో పాటు, జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ) వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువును జనవరి 9 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. ఇతర సమాచారం కోసం ‘ https://ncert.nic.in/national-talent-examination.php ’ను గానీ, డీఈవో కార్యాలయాల్లో గానీ సంప్రదించాలని సూచించారు.
Published date : 19 Dec 2020 04:09PM