ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి...శరవేగంగా 10,470 పోస్టుల భర్తీకి అనుమతి!
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.
గత టీడీపీ సర్కారు వీటిని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు కలిగేలా వ్యవహరించింది. ఏళ్ల తరబడి వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా.. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇప్పటికే వాటిల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పెద్దఎత్తున డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నియామకాన్ని శరవేగంగా చేపడుతోంది.
ఇప్పటివరకు 6,086 పోస్టుల భర్తీ
జిల్లా స్థాయిలో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) కింద ఆసుపత్రుల్లో మొత్తం 8,350 రెగ్యులర్ పోస్టుల భర్తీకి అనుమతించగా.. ఇప్పటివరకు 4,902 పోస్టులను భర్తీచేశారు. అలాగే, రాష్ట్ర స్థాయిలో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్య విధాన పరిషత్, డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద 2,120 పోస్టులు మంజూరు చేయగా ఇప్పటివరకు 1,184 పోస్టులను భర్తీచేశారు. ఒకేసారి ఇంతపెద్ద మొత్తంలో పోస్టులను భర్తీచేయడం ఇదే తొలిసారని వైద్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ప్రభుత్వాసుపత్రులు, ప్రజారోగ్యంపట్ల సీఎం జగన్‌కి ఉన్న చిత్తశుద్ధికి ఇది అద్దంపడుతోందని చెబుతున్నాయి. ఇక మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోందని, వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేయనున్నట్లు ఆ శాఖాధికారులు తెలిపారు.
జిల్లా స్థాయి పోస్టుల రెగ్యులర్ రిక్రూట్ వివరాలు..
రాష్ట్రస్థాయిలో పోస్టుల మంజూరు, భర్తీ వివరాలు..

జిల్లా | డీఎంఈ పోస్టుల కేటాయింపు | పోస్టుల భర్తీ | ఏపీవీవీపీ పోస్టుల కేటాయింపు | పోస్టుల | డీపీహెచ్ భర్తీ పోస్టుల కేటాయింపు | పోస్టుల భర్తీ |
శ్రీకాకుళం | 214 | 193 | 160 | 160 | 192 | 94 |
విజయనగరం | -- | -- | 167 | 167 | 170 | 152 |
విశాఖ | 380 | 320 | 238 | 238 | 169 | 87 |
తూ.గోదావరి | 322 | -- | 205 | 205 | 360 | 325 |
ప. గోదావరి | -- | -- | 127 | 127 | 225 | 94 |
కృష్ణా | 355 | -- | 146 | 146 | 263 | 38 |
గుంటూరు | 292 | -- | 139 | 139 | 255 | 32 |
ప్రకాశం | 229 | 171 | 207 | 207 | 200 | 186 |
నెల్లూరు | 54 | -- | 137 | 137 | 218 | 27 |
చిత్తూరు | 261 | 87 | 195 | 195 | 264 | 181 |
వైఎస్సార్ | 208 | 2 | 222 | 222 | 186 | 110 |
కర్నూలు | 339 | 217 | 215 | 215 | 205 | 84 |
అనంతపురం | 444 | -- | 189 | 189 | 198 | 155 |
మొత్తం | 3,098 | 990 | 2,347 | 2,347 | 2,905 | 1,565 |
రాష్ట్రస్థాయిలో పోస్టుల మంజూరు, భర్తీ వివరాలు..
శాఖ పేరు | కేడర్ పోస్టు పేరు | మంజూరు | భర్తీ | ప్రోసెస్ |
డీఎంఈ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 737 | 610 | 127 |
ఏపీవీవీపీ | సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్ట్ 692 | 176 | 152 |
|
- | డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ | 26 | -- | 26 |
డీపీహెచ్ | సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్ట్ | 665 | 398 | 267 |
మొత్తం | | 2,120 | 1,184 | 572 |
Published date : 25 Sep 2020 03:04PM