పాఠశాలలకు సామగ్రి సమకూర్చలేని సంస్థలపై చర్యలు: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమం పాఠశాలలకు ఫ్యాన్లు, బ్లాక్ బోర్డులు, బెంచీలు తదితర సామగ్రిని సకాలంలో అందించలేని సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
ఇప్పటివరకు లక్ష్యం మేరకు సరఫరా కాకపోవడంపై వివిధ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించారు. స్వల్ప అస్వస్థతతో వైద్యశాలలో చికిత్స పొందుతున్న మంత్రి ఆదిమూలపు మంగళవారం వైద్యశాల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాడు-నేడుపై సమీక్ష నిర్వహించారు.
మంత్రి ఇంకా ఏమన్నారంటే..
మంత్రి ఇంకా ఏమన్నారంటే..
- సెప్టెంబర్ 1 నాటికి 70 నుంచి 80 శాతం సామగ్రిని సరఫరా చేయాలి. ఇప్పటివరకు నిర్దేశించిన స్థాయిలో సరఫరా చేయని కంపెనీలకు నోటీసులు ఇవ్వాలి.
- ఆయా కంపెనీల స్థాయిని పరిశీలించేందుకు అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయాలి.
- తిరిగి సెప్టెంబర్ 1న నిర్వహించే సమీక్ష జరిపే రోజుకు 80 శాతం సామగ్రి తప్పనిసరిగా సరఫరా చేయాలి.
Published date : 26 Aug 2020 01:25PM