పాఠశాల విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా డిజిటల్ పాఠాలు: కేసీఆర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని కోరింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబం« దించిన డిజైన్లను ఆమోదించింది.
Published date : 06 Aug 2020 02:36PM