పాత పద్ధతిలోనే... టీచర్లకు జీతాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్ల వేతన బిల్లులను చేసే బాధ్యతలను మళ్లీ మండల విద్యాధికారులకే (ఎంఈవో) విద్యాశాఖ అప్పగించింది.
గతంలో ఆయా పాఠశాలల టీచర్ల వేతన బిల్లులను ఎంఈవోలే చేయగా, ఇటీవల విద్యాశాఖ ఆ బాధ్యతలను స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు అప్పగించింది. అయితే ఎంఈవోల ఆధ్వర్యంలోనే వేతన బిల్లుల ప్రక్రియను చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీనికితోడు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైన నేపథ్యంలో పాత పద్ధతిలోనే కొనసాగించాలని పేర్కొంటూ పాఠశాల విద్య ఇన్‌ఛార్జి కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈవోలే ఆయా టీచర్ల వేతన బిల్లులను చేసేలా డీఈవోలు చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published date : 04 Feb 2020 04:25PM