నేటి ఎంబీబీఎస్ సెకండియర్ ఫోరెన్సిక్ మెడిసిన్ పరీక్ష రేపటికి వాయిదా
Sakshi Education
లబ్బీపేట(విజయవాడతూర్పు) : డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని వైద్య కళాశాలలో శుక్రవారం నిర్వహించాల్సిన ఎంబీబీఎస్ సెకండియర్ ఫోరెన్సిక్ మెడిసిన్ సబ్జెక్ట్ పరీక్షను వాయిదా వేసినట్టు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మొహర్రం సెలవు ప్రకటించినందున ఆ రోజు జరగాల్సిన పరీక్షను మరుసటి రోజు శనివారం నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 20 Aug 2021 07:02PM