నాస్కామ్‌తో తెలంగాణ కళాశాల విద్యా శాఖ ఒప్పందం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య కేంద్రాల ద్వారా విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను అందిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పరిశ్రమలు, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను సిద్ధం చేసే ఉద్దేశం తో కళాశాల విద్యాశాఖ టీఎస్‌కేసీ ద్వారా నాస్కామ్‌తో ఓ ఒప్పందం కుదు ర్చుకుంది. కళాశాలల నుంచి గుర్తించిన అధ్యాపకులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఆయా నైపుణ్యాలను విద్యార్థులకు అందజేయటం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ సమక్షంలో సంయుక్త డెరైక్టర్ మంజులత, నాస్కామ్ ప్రతినిధి సంధ్య ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్‌ను విద్యార్థులకు చేరువ చేస్తామన్నారు. విద్యాశాఖ నైపుణ్య విద్యను అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.
Published date : 08 Feb 2020 04:16PM