Skip to main content

మనూ ప్రవేశ పరీక్షలు వాయిదా

రాయదుర్గం: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని వివిధ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిద్దిఖీ మహ్మద్ మహమూద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ నేపథ్యంలో సెప్టెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వివరించారు. కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అండర్ గాడ్యుయేట్లు,ఏఎంసీ, బ్రిడ్జి కోర్సులను ఆన్‌లైన్ దరఖాస్తు కోసం పొడిగించిన చివరి తేదీ సెప్టెంబర్ 30వ తేదీ అని ఆయన గుర్తుచేశారు.
Published date : 04 Sep 2020 02:31PM

Photo Stories