Skip to main content

మిశ్రమ వ్యవసాయ పద్ధతులపై యువతకు శిక్షణ: ఏపీఎస్‌ఎస్‌డీసీ

సాక్షి, అమరావతి: మిశ్రమ వ్యవసాయ పద్ధతులపై ఉద్యాన యూనిర్సిటీతో కలిసి పనిచేసేందుకు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎస్‌ఎస్‌డీసీ) నిర్ణరుుంచింది.
ఇప్పటివరకు వివిధ ఉపాధి రంగాల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న ఏపీఎస్‌ఎస్‌డీసీ ఇకపై ఉద్యాన పంటలను ఆధునిక పద్ధతుల్లో పండిస్తూ మంచి ఆదాయం సాధించే దిశగా యువతను ప్రోత్సహించాలనే ఆలోచనకు వచ్చింది. ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు ఏపీ ఎస్‌ఎస్‌డీసీ సిద్ధమైంది. ఈ మేరకు అక్కడి అధ్యాపకులు, అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. వ్యవసాయ రంగంలో పట్టభద్రులైన ఎంతోమంది ఆ రంగంలో పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నారు. ఈ దృష్ట్యా వ్యవసాయ రంగంపై ఆధారపడిన నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ రంగాన్ని బలోపేతం చేయడమేకాకుండా ఆ రంగంలో ఉత్పత్తి, ఆదాయాల్ని గణనీయంగా పెంచవచ్చనేది ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఆలోచన. ఇప్పటికే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 100 మందికి పైగా ఉద్యాన సిబ్బందికి ల్యాండ్ స్కేప్ గార్డెనింగ్ అండ్ అర్బన్ ఫార్మింగ్‌పై నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.

రీసెర్చ్ స్కాలర్స్ సహకారంతో..
వర్సిటీలో విద్యార్థులు ఉద్యాన పంటలపై అధ్యయనాలు చేశారు. పూలు, కూరగాయల సాగు క్షేత్రాలు, నూతన వంగడాలు, వైవిధ్యమైన సాగు పద్ధతుల నమూనాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఉద్యాన ఉత్పత్తులు, తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయమిచ్చే సమీకృత వ్యవసాయ విధానాలు, సేంద్రియ సాగు, జీవ ఎరువుల తయారీని అభివృద్ధి చేశారు. అందువల్ల యూనివర్సిటీ రీసెర్చ్ విద్యార్థుల సహకారం కూడా తీసుకోవాలనే ఆలోచనతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉంది.
Published date : 27 Jan 2021 04:59PM

Photo Stories