మీ చేతిరాత బాగాలేదా.. అయితే మీకోసమే ఇది!
Sakshi Education
సాక్షి, అమరావతి: అందమైన చేతిరాతను 15 రోజుల్లోనే నేర్చుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) మహిళలకు ఆన్‌లైన్ శిక్షణను అందిస్తోంది.
వీరికి ఆలిండియా కాలిగ్రఫీ రైటింగ్ స్పెషలిస్ట్ పీబీ చంద్ర శిక్షణ ఇవ్వనున్నారు. అమ్మఒడి ఆర్గనైజేషన్, ఏపీఎస్‌ఎస్‌డీసీ సంయుక్తంగా చేపట్టిన కాలిగ్రఫీ శిక్షణను ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు.
Published date : 05 Nov 2020 03:12PM