‘మెడికల్’ మెరిట్ లిస్ట్ విడుదల: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ
Sakshi Education
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలో 2020–21 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.
అభ్యంతరాలుంటే డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు తమ ర్యాంకు, రోల్ నంబరు, సంబంధిత సర్టిఫికెట్లతో యూనివర్సిటీలో సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్‌లిస్టును యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Published date : 01 Dec 2020 04:16PM