మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంక్రాంతి సెలవుల అనంతరం మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 13 (సోమవారం)నఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై మరింతగా పౌష్టిక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందజేసేలా కింద పేర్కొన్న మేరకు మెనూలో మార్పులు చేసింది. అన్ని పాఠశాలల్లో ఈ మేరకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖను ఆదేశించింది.
- సోమవారం : అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, చిక్కీ
- మంగళవారం : చింతపండు/నిమ్మకాయ/మామిడి కాయ (పులిహోరా) అన్నం, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు
- బుధవారం : వెజిటబుల్ రైస్ (కూరగాయలతో కూడిన అన్నం), ఆలూ కూర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ
- గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు
- శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
- శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్
Published date : 14 Jan 2020 01:31PM