మార్చి 3 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు: ఉన్నత విద్యామండలి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను మార్చి 3 నుంచి 10వ తేదీ వరకు ‘ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ)’ పోర్టల్‌లో ఆయా డిగ్రీ కాలేజీలు అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఇప్పటికే రెండు విడతల్లో నిర్వహించిన ఆన్‌లైన్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించబడిన విద్యార్థులు తమ కేటాయింపును రద్దు చేసుకోవాలనుకుంటే.. ఆ సమాచారాన్ని, రిక్వెస్టు లెటర్‌తో సహా కాలేజీల లాగిన్ ఐడీ ద్వారా ఓఏఎండీసీ పోర్టల్‌లో ఈ నెల 27లోపు అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఇక 20 శాతం కన్నా తక్కువగా సీట్ల భర్తీ జరిగిన కోర్సులను సదరు కాలేజీలు కొనసాగిస్తున్నాయా? నిలిపివేస్తున్నాయా? అన్న అంశాలను కూడా ఈ నెల 27వ తేదీలోగా తెలపాలన్నారు. ఆయా కళాశాలలు విద్యార్థుల అనుమతితో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయవచ్చని సూచించారు.
Published date : 26 Feb 2021 04:17PM