లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి పోస్టుల భర్తీలో అవకతవకలు..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బాలల హక్కుల పరిరక్షణ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఎల్‌సీపీఓ (లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్) పోస్టుల భర్తీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు పట్టించుకోకుండా పలు జిల్లాల్లో ఇష్టానుసారంగా పోస్టుల భర్తీ జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ నియామక ప్రక్రియపై రాష్ట్ర కార్యాలయం పర్యవేక్షణ లోపించడంతో ఈ అవకతవకలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో సమగ్ర శిశు పరిరక్షణ పథకం (ఐసీపీఎస్)లో భాగంగా ప్రతి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ విభాగాలు కొనసాగుతున్నాయి. ప్రతి జిల్లాకో ఎల్‌సీపీఓ పోస్టును ప్రభుత్వం మంజూరు చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో వీటిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. జిల్లా స్థాయిలో పోస్టుల భర్తీకి అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే ఈ పోస్టులు భర్తీ కాగా, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో, కాంట్రాక్టు ముగిసి ఖాళీలు ఏర్పడిన జిల్లాల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 20 పోస్టులకు సంబంధించి ఆయా జిల్లా యంత్రాంగాల ఆధ్వర్యంలో గతేడాది చివరలో నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్ష నిర్వహించిన తర్వాత అర్హతలు సాధించిన అభ్యర్థుల్లో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకు పిలిచారు. అయితే ఈ ఇంటర్వ్యూలన్నీ ఇష్టానుసారంగా నిర్వహించారని, నిబంధనలతో పాటు అభ్యర్థులు ధ్రువపత్రాలను పరిశీలించకుండానే పోస్టింగ్ ఇచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు.
‘ఆర్టీఐ’తో వెలుగులోకి...
మేడ్చల్ జిల్లాలో ఎల్‌సీపీఓ పోస్టు భర్తీలో యంత్రాంగం నిబంధనలు పట్టించుకోలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాత పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థి సమాచార హక్కు చట్టం కింద ఎల్‌సీపీఓ నియామకానికి సంబంధించి దరఖాస్తు చేశాడు. ఈక్రమంలో యంత్రాంగం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రాత పరీక్ష మార్కులను ఇక్కడ పరిగణనలోనికి తీసుకోనట్లు తెలుస్తోంది. అలాగే అభ్యర్థి స్థానికతపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం పదోతరగతి విద్యాభ్యాసం చేసిన ప్రాంతాన్నే స్థానికతగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఒకవైపు రెగ్యులర్ పీజీ చేస్తూనే, మరోవైపు జూనియర్ అడ్వొకేట్‌గా ఎక్స్‌పీరియన్స్ ను జోడించిన అభ్యర్థిని ఎంపిక చేయడంపై అభ్యర్థులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఏకకాలంలో రెగ్యులర్ కోర్సు, ప్రాక్టీస్‌ను పరిగణించడం నిబంధనలకు విరుద్ధమని అభ్యర్థులు చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలే ఇతర జిల్లాల్లో వ్యక్తమవుతున్నాయి.

Published date : 30 Nov 2020 03:25PM