లా వర్సిటీల్లో పరీక్షల నిర్వహణకు బీసీఐ గ్రీన్‌సిగ్నల్..!
Sakshi Education
న్యూఢిల్లీ: న్యాయ విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆదివారం అనుమతి ఇచ్చింది.
భౌతికంగా (ఫిజికల్) పరీక్షలు నిర్వహించవచ్చని సూచించింది. కరోనా నేపథ్యంలో పరీక్ష రాసేందుకు చాలామంది విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. అలాంటి వారికి ఆప్షన్ ఇవ్వాలని బీసీఐ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) తీసుకొని పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.
Published date : 02 Nov 2020 04:53PM