క్యాట్ ఫలితాల్లో ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థికి మొదటి ర్యాంక్
Sakshi Education
తిరుపతి ఎడ్యుకేషన్: కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్) ఫలితాల్లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ధరూరి ఫణీత్ 99.85 శాతంతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.
చిత్తూరు జిల్లా కలకడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన రైతు డి.చంద్రయ్యనాయుడు, శోభారాణి దంపతుల కుమారుడు ఫణీత్. ప్రముఖ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ నెలకొల్పాలన్నదే తన కోరికని ఫణీత్ చెప్పాడు. ఫణీత్‌ను సీఎల్ విద్యాసంస్థ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ అభినందించారు.
Published date : 04 Jan 2021 03:17PM