క్యాలిక్యులేటర్లకు సీబీఎస్‌ఈ అనుమతి
Sakshi Education
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలకు హాజర య్యే ప్రత్యేకావసరాలున్న విద్యార్థులు (సీడబ్ల్యూఎస్‌ఎన్) తమ వెంట బేసిక్ క్యాలిక్యులేటర్లను తెచ్చుకోవడానికి సీబీఎస్‌ఈ అనుమతి నిచ్చింది.
ఈ మేరకు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ పాఠశాల లకు పంపిన లేఖల్లో పేర్కొన్నారు. ఈ సదుపాయం కేవలం 2020లో జరిగే పరీక్షలకు ప్రత్యేకావసరాలున్న విద్యార్థు లుగా నమోదు చేసుకున్న వారికేనని తెలిపారు. ఈ సదుపాయం పొందడానికి విద్యార్థులు తమ పాఠశాలల్లో జనవరి 28లోగా అనుమతి కోరాలని, దాన్ని ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు సీబీఎస్‌ఈ ప్రాంతీయ కార్యాలయానికి పంపించా లని పేర్కొన్నారు. సంబంధిత సర్టిఫికెట్ లేకుండా క్యాలిక్యులేటర్లను అనుమతించ బోమని స్పష్టం చేశారు. కాగా, 2018లో సీబీఎస్‌ఈ బోర్డు ప్రత్యేకావసరాలున్న విద్యార్థులు తమ పరీక్షలను కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల ద్వారా రాసుకోవడానికి అనుమతినిచ్చింది.
Published date : 23 Jan 2020 02:47PM