కేజీబీవీ బదిలీల్లో పైరవీల జోరు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లోని బోధన సిబ్బంది బదిలీల్లో పైరవీలకు తెరలేచింది.
ఆన్‌లైన్ పద్ధతిలో బదిలీల ప్రక్రియ ముగియడంతో తాజాగా ఏర్పడిన ఖాళీల్లో ఆఫ్‌లైన్ పద్ధతిలో పోస్టింగ్ పట్టేందుకు సమగ్ర శిక్షా సంచాలక కార్యాలయానికి ఆశావహుల తాకిడి పెరిగింది. ఉపాధ్యాయ సంఘ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఉన్నతాధికారులకు ఏకంగా ఫోన్లు చేయించి నచ్చిన చోటుకు బదిలీ అయ్యేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 450 కేజీబీవీ ప్రత్యేకాధికారులతో పాటు పీజీ సీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీ, ఏఎన్‌ఎం కేటగిరీల్లో నిబంధనలతో కూడిన బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు డెరైక్టర్ గత నెలలో బదిలీ నోటిఫికేషన్ జారీ చేశారు. పరస్పర అంగీకారం, జిల్లా పరిధిలో ఇష్టపూర్వక బదిలీలు, అంతర్ జిల్లా ఇష్టపూర్వక బదిలీలుగా విభజించి మూడు విధాలుగా బదిలీల ప్రక్రియ నిర్వహించింది. గత నెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో 690 మంది వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి ఎస్‌ఎస్‌ఏ అధికారులు.. ఆన్‌లైన్ ద్వారానే కౌన్సెలింగ్ పూర్తి చేశారు. మొత్తంగా 312 కేజీబీవీల్లోని 382 మంది సిబ్బందికి స్థాన చలనం కలిగింది. ఇందులో 70 మందికి పరస్పర అంగీకార బదిలీలు జరగగా, 228 మందికి జిల్లా పరిధిలో ఇష్టపూర్వక బదిలీలు, 84 మందికి అంతర్ జిల్లా ఇష్టపూర్వక బదిలీలు జరిగాయి. తాజాగా రెండ్రోజుల క్రితం బదిలీ పొందిన సిబ్బంది వివరాలను ఎస్‌ఎస్‌ఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
కొత్త ఖాళీల్లో పైరవీకారులు..
తాజాగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే వివరాలు బహిర్గతమయ్యాయి. దీంతో ఆయా స్థానాల్లో పోస్టింగుల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖాళీలున్న చోటును ప్రస్తావిస్తూ.. అక్కడ పోస్టింగ్ ఇవ్వాలంటూ సమగ్ర శిక్షా ప్రాజెక్టు రాష్ట్ర సంచాలకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకరిద్దరు ఆశావహులు ఏకంగా ఓ మంత్రితో ఫోనులో సిఫార్సు చేయించుకోగా.. మరో ఇద్దరు ఆయా ప్రాంత శాసనసభ్యులతో ఫోన్లు చేయిస్తున్నారు. బదిలీ పొందిన వారు కూడా ఖాళీగా ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వాలంటూ వినతులు ఇస్తున్నారు. ఇలా దాదాపు వందకు పైగా వినతులు ఎస్పీడీ ముందుకు చేరాయి. అయితే వీటిపై ఎస్పీడీ ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు తెలిసింది. వీటిని క్లియర్ చేస్తే మరిన్ని వినతులు వచ్చే అవకాశం ఉందనే భావన ఎస్పీడీ కార్యాలయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలా? లేక పక్కన పెట్టాలా అనే అంశాన్ని ఎస్పీడీ కార్యాలయ అధికారులు తేల్చుకోలేక పోతున్నారు.

Published date : 04 Jan 2020 12:58PM