జీరో అడ్మిషన్లు, 25% లోపు హాజరున్న 176 ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు నోటీసులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 176 ప్రైవేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి జనవరి 28 (మంగళవారం)న నోటీసులు జారీచేసింది.
వీటిలో ఒక్క విద్యార్థీ లేని కాలేజీలు 25 ఉండగా, 25 శాతం కన్నా తక్కువ నమోదు ఉన్న కాలేజీలు 151 ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తగినంతగా లేకపోవడం వల్ల ఈ కాలేజీల్లో సరైన ప్రమాణాలు పాటించడం లేదు. ఈ పరిస్థితుల్లో వీటిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆయా కాలేజీల పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ 176 కాలేజీలు తమ కాలేజీలకు సంబంధించిన ఒరిజినల్ రికార్డుల పత్రాలను, డాక్యుమెంట్లను ఫిబ్రవరి 14 లోగా కమిషన్‌కు పంపాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. acapsche@gmail.com కు వాటిని పంపాలని పేర్కొంది.
Published date : 29 Jan 2020 04:11PM