ఇంజనీరింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్‌లో భాగంగా మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును పొడిగించినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
అక్టోబర్ 28తో ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ముగియగా, విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 29న కూడా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అక్టోబర్ 29వ తే దీన కూడా ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చని వెల్లడించారు. కాగా, 50,137 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా..అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం వరకు 36,659 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Published date : 29 Oct 2020 04:21PM