ఇక పదో తరగతి తర్వాత నుంచే సీఏ: ఐసీఏఐ
Sakshi Education
న్యూఢిల్లీ: విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసిన వెంటనే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)లో ప్రొవిజినల్ అడ్మిషన్ పొందవచ్చని ఐసీఏఐ స్పష్టం చేసింది.
చార్టర్డ్ అకౌంటెంట్ రెగ్యులేషన్స్-1988 చట్టానికి చేసిన సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ అవకాశం లభించనుంది. అయితే ప్రొవిజినల్ అడ్మిషన్ పొందిన విద్యార్థి 12వ తరగతి పరీక్షలు పాసయ్యాకే సీఏ ఫౌండేషన్ కోర్సులో రెగ్యులర్ అవుతారని ఈ నిబంధనలు చెబుతున్నాయి. 12వ తరగతి పూర్తవ్వగానే సీఏలో చేరుతుండడంతో సీఏ కోర్సు ఆరు నెలల ముందుగానే ముగుస్తుందని ఐసీఏఐ అధ్యక్షుడు అతుల్‌కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఇంటర్ చదువుతుండగానే ఫౌండేషన్ కోర్సుకు సిద్ధం కావడం కోసమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Published date : 21 Oct 2020 02:02PM