హైదరాబాద్ విద్యార్థికి సీఏలో 30వ ర్యాంకు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఇటీవల ప్రకటించిన సీఏ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్ జైన్ జాతీయ స్థాయిలో 30వ ర్యాంకు సాధించినట్లు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టడీస్ (ఐఎస్‌ఎఫ్‌ఎస్) చైర్మన్ బ్రహ్మదేవర అవినాష్ తెలిపారు.
గత నవంబర్‌లో 400 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించగా, సిద్ధార్థ్ 334 మార్కులు సాధించాడని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సీఏలో 23 శాతమే అర్హత సాధించినట్లు వెల్లడించారు.
Published date : 06 Feb 2020 04:11PM