Skip to main content

గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
2020-21 వార్షిక బడ్జెట్ రూపకల్పనపై జనవరి 24 (శుక్రవారం)నఆయన చాంబర్‌లో ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గురుకుల పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈ మేరకు గురుకుల పా ఠశాలల వారీగా అవసరాలను గుర్తించాలన్నారు. ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహకార పథకాల అమలుకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలన్నారు.
Published date : 25 Jan 2020 02:46PM

Photo Stories