గడువులోగా ‘మనబడి నాడు–నేడు’ పనులు: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ మొదటి విడత పనులను గడువులోగా పూర్తిచేసి రెండోవిడత పనులు ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.
మనబడి నాడు–నేడు, టెన్త్, ఇంటర్ పరీక్షల అంశంపై గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు–నేడు పనుల్లో ముఖ్యంగా ప్రహరీల నిర్మాణం తక్షణమే పూర్తిచేయాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న వాటిని 20లోగా పూర్తిచేయాలన్నారు. 14,971 పాఠశాలల్లో పెయింటింగ్ పనులకు గాను 82 శాతం పూర్తిచేశారని.. మిగిలినవి కూడా పూర్తిచేయాలని సూచించారు. 2021–22 విద్యా సంవత్సరం కాలెండర్‌ను తయారుచేయాలన్నారు. జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలిస్తే అందుకు తగ్గట్టుగా టైం టేబుల్ తయారుచేసుకోవాలని సూచించారు.
Published date : 11 Jun 2021 12:49PM