Skip to main content

ఎస్‌ఎస్‌సీ బోర్డులో సిటిజన్ చార్టర్

సాక్షి, అమరావతి: వివిధ అవసరాలపై వచ్చే అభ్యర్థులకు అందించే సేవలను నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేసేలా ప్రభుత్వ పరీక్షల డెరైక్టరేట్ (ఎస్‌ఎస్‌సీ బోర్డు) సిటిజన్ చార్టర్‌ను అమలులోకి తెచ్చింది.
ఏయే పనులకు అభ్యర్థులు ఏయే పత్రాలు సమర్పించాలి, వాటిని ఎన్నిరోజుల్లో సిబ్బంది పరిష్కరించాలో బోర్డు డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఎస్‌ఎస్‌సీ, డీఈడీ, ఎల్‌పీటీ, టీటీసీ, టీసీసీ తదితర కోర్సుల డూప్లికేట్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసేవారు నిర్ణీత పత్రాలతో రూ.250 ఫీజు చెల్లించాలి. వారికి 7 పని దినాల్లో ఆ డూప్లికేట్ సర్టిఫికెట్లను అందించాలి. డూప్లికేట్ మెమోలు, వయసు, మైగ్రేషన్ సర్టిఫికెట్ల కోసం రూ.80 ఫీజు చెల్లించి దరఖాస్తు అందిస్తే.. 2 పని దినాల్లో పరిష్కరించాలి. ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌లో తప్పుల సవరణకు ఎలాంటి ఫీజు లేకుండా నిర్ణీత పత్రాలతో దరఖాస్తు చేస్తే ఆరు పని దినాల్లో పరిష్కరించాలి. డీఈడీ, ఎల్‌పీటీ, టీటీసీ, టీసీసీ తదితర సర్టిఫికెట్లలో తప్పుల సవరణ దరఖాస్తుకు కూడా ఎలాంటి ఫీజు లేదు. దాన్ని సిబ్బంది ఆరు రోజుల్లో పరిష్కరించాలి.
Published date : 28 Oct 2020 03:15PM

Photo Stories