ఏపీ విద్యార్థికి ‘గేట్’లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ప్రవేశపరీక్షలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఎ.పవన్‌కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు.
మార్చి 13న విడుదల చేసిన ఫలితాల్లో పవన్‌కు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ లభించింది. శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశాక తిరుపతిలో గేట్‌కు శిక్షణ పొందాడు. అలాగే ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ విభాగంలో బీటెక్ చేస్తున్న ధర్మవరం వరుణ్ సాయికి జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ లభించింది.
Published date : 14 Mar 2020 04:38PM