ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు
Sakshi Education
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ అభ్యర్థుల నుంచి డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీఎస్సీ (ఆనర్స్) వ్యవసాయం, బీటెక్ (వ్యవసాయ ఇంజనీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటాలో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 చివరి తేదీగా నిర్ణయించారని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆఫ్‌లైన్ విధానంలో ఉంటాయని, మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ను పరిశీలించాలని సూచించారు.
Published date : 16 Dec 2020 03:20PM