Skip to main content

ఎంసెట్ చార్జిషీటులో లోపాలు సవరణకు యత్నాలు

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్ కేసు చార్జిషీటులో లోపాలు బయటపడ్డాయి.
2016లో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో మూడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గతేడాది జూలైలో ఎట్టకేలకు సీఐడీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు ఎక్కడా తప్పించుకునేందుకు వీల్లేకుండా అత్యంత పకడ్బందీగా రూపొందించారని అప్పట్లో అధికారులు తెలిపారు. ఇటీవల ఈ చార్జిషీటును న్యాయనిపుణులు పరిశీలించినపుడు పలు లోపాలు బయటపడ్డట్లు సమాచారం. ఇవి నిందితులకు అనుకూలంగా మారుతాయని వారు అభ్యంతరం లేవనెత్తారు. దీంతో సీఐడీ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఆ లోపాలను సవరించే పనిలో పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్బీ సింగ్ అలియాస్ శివబహదూర్ సింగ్‌తోపాటు దాదాపు 60 మందికిపైగా నిందితులుగా ఉన్నారు. ఇదే కేసులో 400 మందికిపైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాక్షులుగా ఉన్న విషయం తెలిసిందే.
Published date : 28 Jan 2020 02:41PM

Photo Stories