ఎంఫిల్ పార్ట్–1 పరీక్షల షెడ్యూల్ విడుదల: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్‌లో నిర్వహించనున్న ఎంఫిల్ పార్ట్–1, ప్రీ పీహెచ్‌డీ పరీక్షల షెడ్యూల్‌ను రీసెర్చ్ సెల్ కోఆర్డినేటర్ ఆచార్య ఎల్.ఉదయకుమార్ బుధవారం విడుదల చేశారు.
పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరుగుతాయి. సెమినార్‌ను సంబంధిత విభాగాల్లో ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు మార్చి 15 ఆఖరు తేదీ. రూ.2 వేల ఆలస్య రుసుంతో మార్చి 20 వరకు ఫీజు చెల్లించవచ్చు.
Published date : 25 Feb 2021 04:40PM