ఏఐఈఈఏ ర్యాంకులే అగ్రీ పీజీ కోర్సులకు ప్రాతిపదిక
Sakshi Education
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 4 వ్యవసాయ కళాశాలల్లో (బాపట్ల, తిరుపతి, నైరా, మహానంది) పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులైన ఎంఎస్సీ, పీహెచ్‌డీ, ఎంబీఏ (అగ్రీ)లలో ప్రవేశానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్-న్యూఢిల్లీ) నిర్వహించే అఖిల భారత వ్యవసాయ ప్రవేశ పరీక్షనే (ఏఐఈఈఏ- పీజీ) ప్రాతిపదికగా తీసుకుంటారు.
ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ ప్రత్యేకంగా ఎటువంటి పరీక్ష నిర్వహించదని యూనివర్శిటీ అధికారి డాక్టర్ బాలగురవయ్య జనవరి 13 (సోమవారం)నఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని 71 విశ్వ విద్యాలయాలకు ఏఐఇఇఏ- పీజీ పరీక్షే ప్రాతిపదిక అని చెప్పారు. వచ్చే జూన్ ఒకటిలోగా పూర్తయ్యే అడ్మిషన్లకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 14 Jan 2020 01:34PM