దివ్యాంగుల అక్షకాస్యత: చదువుకు వైకల్యం అడ్డుకాదు...
Sakshi Education
సాక్షి, అమరావతి: చదువుకు వైకల్యం అడ్డుకాదని రాష్ట్రంలో దివ్యాంగులు నిరూపిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 12,19,785 మంది దివ్యాంగులున్నారు. వీరిలో ఏడేళ్లు దాటిన వారిలో అక్షరాస్యత 38.4 శాతం ఉంది. 15 ఏళ్లు దాటిన వారిలో 15.4 శాతం మంది ఉన్నత చదువులను పూర్తిచేశారు. కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకశాఖ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దివ్యాంగుల్లో ఏడేళ్లు దాటినవారిలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో 41.6 శాతం, మహిళల్లో 22.5 శాతం, పట్టణాల్లో పురుషుల్లో 66 శాతం, మహిళల్లో 43.9 శాతం అక్షరాస్యత ఉంది. దివ్యాంగుల్లో 15 ఏళ్లు దాటినవారిలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో 15.8 శాతం మంది, మహిళల్లో 6.7 శాతం, పట్టణాల్లో పురుషుల్లో 35.3, మహిళల్లో 17.4 శాతం మంది ఉన్నత చదువులను పూర్తిచేశారు. రాష్ట్రంలో ఏదో ఒక వైకల్యంతో ఉన్న వారు 3 శాతం మంది ఉన్నారు. వీరిలో అవయవాల వైకల్యం కలిగినవారు 1.9 శాతం మంది, దృష్టి లోపం ఉన్నవారు 0.3 శాతం మంది, వినికిడి లోపం ఉన్నవారు 0.5 శాతం మంది, మాట్లాడలేనివారు 0.3 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో మానసిక అనారోగ్యంతో 0.1 శాతం మంది, మేధో వైకల్యంతో 0.2 శాతం మంది, ఇతర వైకల్యంతో 0.1 శాతం మంది బాధపడుతున్నారు. ఒంటరిగా ఉంటున్న దివ్యాంగుల శాతం 8.2. రాష్ట్రంలో 39.3 శాతం మంది వికలాంగులకు ప్రభుత్వ సాయం అందుతుండగా ఇతర సంస్థల నుంచి 2.4 శాత మందికి చేయూత లభిస్తోంది.
కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకశాఖ అధ్యయనంలో వెల్లడించిన అంశాలు..
కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకశాఖ అధ్యయనంలో వెల్లడించిన అంశాలు..
- రాష్ట్రంలో ఏడేళ్లుదాటిన దివ్యాంగుల్లో అక్షరాస్యత: 38.4 శాతం
- 15 ఏళ్లు దాటిన వారిలో ఉన్నతవిద్య చదివినవారు: 15.4 శాతం
- రాష్ట్రంలో మొత్తం దివ్యాంగులు: 12.19 లక్షల మంది
- వీరిలో సర్కారు సాయం: 39.3 శాతం మందికి
Published date : 08 Apr 2021 03:32PM