చదువూ, ఆరోగ్యం..రెండూ ముఖ్యమే: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వానికి విద్యార్థుల ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. వారి చదువూ అంతే ముఖ్యమని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
గతేడాది ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవడం వల్ల విద్యార్థులకు ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. అందుకే వారి విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని తెలిపారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం నిర్ణయిస్తామని చెప్పారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు కష్టపడి చదువుతున్నారని.. టీడీపీ నేత లోకేష్ లాగా ఎవరో చదివిస్తే, మరెవరో పరీక్షలు రాస్తే పాస్ అయ్యే రకం కాదన్నారు. ఒక్క ఏడాదిలోనే లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి వచ్చి ప్రభుత్వ స్కూళ్లలో చేరారని చెప్పారు.
‘వకీల్’కు వకాల్తా పుచ్చుకున్నప్పుడు కరోనా గుర్తుకు రాలేదా?
పరీక్షలు నిర్వహిస్తే, స్కూళ్లు నడిపితే 70 లక్షల మంది విద్యార్థులకు కోవిడ్ వస్తుందంటూ లోకేష్ విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వకీల్‌సాబ్ సినిమాకు 6 షోలు వేయాలని చంద్రబాబు డిమాండ్ చేసినప్పుడు.. లోకేష్‌కు కరోనా కనిపించలేదా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో లోకేష్‌కు కనిపించేవన్నారు. ఆయన హైదరాబాద్‌లో ఉంటూ జూమ్ కాన్ఫరె¯Œ్సలు నిర్వహించి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ అనుకూల మీడియాలో అవాకులు చవాకులు మాట్లాడుతున్న లోకేష్‌ను.. అందరూ వెర్రినాయుడు అనుకుంటున్నారని విమర్శించారు.

Published date : 23 Apr 2021 03:39PM