బీసీ గురుకులాల్లో వేగంగా నాడు-నేడు పనులు
Sakshi Education
సాక్షి, అమరావతి: మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో నాడు-నేడు పనులు వేగంగా జరుగుతున్నాయి.
మొదటి విడత కింద 37 గురుకుల స్కూళ్లు, కాలేజీలను ఎంపిక చేశారు. వీటికి నూతన రూపు ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.17,66,99,763ను మంజూరు చేసింది. ఇప్పటి వరకు స్కూళ్లలో రూ. 5,88,86,896 ఖర్చుచేసింది.
ఇక నుంచి ఆహ్లాదకర వాతావరణంలో చదువులు
స్కూళ్లలో నాడు-నేడు పనులు వేగంగా జరుగుతున్నాయి. నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక నుంచి ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చదువుకునేందుకు వీలుంటుంది. స్కూలు ఆవరణ అంతా పచ్చని చెట్లు, అక్కడక్కడా విద్యుత్ లైట్లు, బయట గేటు నుంచి లోపలి భవనం వరకు ఇరువైపులా అమర్చిన విద్యుత్ దీపాలు పాఠశాలలకు అందాన్ని తెస్తున్నాయి.
- ఎ.కృష్ణమోహన్, కార్యదర్శి, ఏపీ బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ
- చాలా స్కూళ్లలో రన్నింగ్ నీటితో కూడిన మరుగుదొడ్లు లేనందున విద్యార్థులు ఇబ్బందిపడేవారు. ఇక ముందు ఆ పరిస్థితులుండవు. స్కూళ్లలో ఇంటి వాతావరణం ఉంటుంది.
- గురుకుల విద్యాలయాల్లో స్కూలు, నివాస భవనాలు పక్కపక్కనే ఉండటం వల్ల విద్యాభ్యాసానికి ఇబ్బందులుండవు.
- ఇప్పటి దాకా చాలాచోట్ల ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. విద్యుత్ పరికరాలు కూడా నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. స్విచ్ వేసేటప్పుడు ఎప్పుడు షాక్ కొడుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందేవారు. నాడు-నేడుతో ఆ కష్టాలు తీరాయి.
- అధునాతన స్విచ్ బోర్డులను అమర్చారు. ఎక్కడా విద్యుత్ వైరు బయటికి కనిపించకుండా అన్నీ పైపుల లోపలే ఉండేలా ఇంజినీరింగ్ శాఖ వారు చర్యలు తీసుకున్నారు.
ఇక నుంచి ఆహ్లాదకర వాతావరణంలో చదువులు
స్కూళ్లలో నాడు-నేడు పనులు వేగంగా జరుగుతున్నాయి. నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక నుంచి ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చదువుకునేందుకు వీలుంటుంది. స్కూలు ఆవరణ అంతా పచ్చని చెట్లు, అక్కడక్కడా విద్యుత్ లైట్లు, బయట గేటు నుంచి లోపలి భవనం వరకు ఇరువైపులా అమర్చిన విద్యుత్ దీపాలు పాఠశాలలకు అందాన్ని తెస్తున్నాయి.
- ఎ.కృష్ణమోహన్, కార్యదర్శి, ఏపీ బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ
Published date : 08 Sep 2020 06:48PM