Skip to main content

అర్చక ఆగమ పరీక్షల్లో 5 చొప్పున గ్రేస్ మార్కులు

సాక్షి, అమరావతి: గతేడాది జూలైలో నిర్వహించిన అర్చక (ఆగమ) పరీక్షల్లో మౌఖిక, ప్రయోగ పరీక్షలకు ఐదు చొప్పున గ్రేస్ మార్కులు కలపాలని దేవదాయ శాఖ నిర్ణయించింది.
ఈ పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణులు కావడానికి అవసరమైన మార్కులు 40 కాగా, కొందరు ఎగ్జామినర్లు 35గా భావించి మార్కులు వేశారు. దీంతో చాలామంది అభ్యర్థులు తమకు నష్టం జరిగిందని, న్యాయం చేయాలని కోరడంతో మానవతా దృక్పథంతో అటువంటి వారికి ఐదు చొప్పున గ్రేస్ మార్కులు కలపడానికి నిర్ణయించినట్టు దేవదాయ శాఖ కమిషనర్ పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన మార్కులను, అభ్యర్థుల మార్కుల జాబితాలను దేవదాయ శాఖ వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్టు పేర్కొన్నారు.
Published date : 21 Jan 2020 02:32PM

Photo Stories